1 నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము.
2 ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునైయుండవలెననియు;
3-5. ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, 5మిగుల మద్యపానాసక్తులునైయుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు; దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడుచు, పతిప్రియులును శిశుప్రియులును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము.
6 అటువలెనే స్వస్థబుద్ధిగలవారై యుండవలెనని యౌవన పురుషులను హెచ్చరించుము.
7-8. పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్ప నేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసములేనిదిగాను మాల్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతోకూడినదిగాను ఉండవలెను.
9-10. దాసులైనవారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, యేమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.
11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై
12-13. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
14 ఆయన సమస్తమైన దుర్ణీతినుండి మనలను విమోచించి, సత్ క్రియలందాసక్తిగల ప్రజలను తనకోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
15 వీటినిగూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో (దుర్భోధను) ఖండించుచునుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము.

No comments:
Post a Comment